శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 26 జులై 2017 (23:03 IST)

నీరుల్లిపాయను ఉడకబెట్టి నాలుగేసి తింటుంటే...

ఉల్లిపాయి గురించి అందరికి తెలిసిన విషయమే. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత మనకు తెలిసిందే. పేదవాడి కూర ఉల్లిచారు. దీనినే పచ్చిపులుసు అని కూడా అంటారు. ఆ చారుకు చలువ చేసే గుణం వుంది. ఉల్లిపాయను తరుచు వాడటం వలన వీర్యము వృద్ధి అవుతుంది. ఉల్లిపాయను

ఉల్లిపాయి గురించి అందరికి తెలిసిన విషయమే. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత మనకు తెలిసిందే. పేదవాడి కూర ఉల్లిచారు. దీనినే పచ్చిపులుసు అని కూడా అంటారు. ఆ చారుకు చలువ చేసే గుణం వుంది. ఉల్లిపాయను తరుచు వాడటం వలన వీర్యము వృద్ధి అవుతుంది. ఉల్లిపాయను తరుచూ తీసుకోవడం వలన రక్తము శుద్ధి అవుతుంది. శ్వాసక్రియకు ఇబ్బంది కలిగించే ఆయాసము, జలుబు వంటి ఊపిరి తిత్తుల వ్యాధుల నుండి రక్షిస్తుంది.
 
ముక్కు బెదిరినపుడు (ముక్కు నుండి రక్తస్రావం కలుగుతున్నప్పుడు) ఉల్లిపాయను నలిపి వాసన పీల్చాలి. ఇలా పీల్చుతుంటే రక్తస్రావం అరికట్టబడుతుంది. ఉల్లిపాయను తరిగేటప్పుడు కళ్ళ వెంట నీరు రావడం సహజం. ఇలా నీళ్ళు రావడం వలన కళ్ళు శుభ్రపడతాయి.
 
గోంగూర పచ్చడి కలిగించే వేడిని ఉల్లిపాయను తినడం వలన వేడి తగ్గుతుంది. కడుపులో బల్ల పెరిగినా, కడుపుకు నీరు పట్టి బాగా ఉబ్బుతూ ఉంటే నీరుల్లిపాయను ఉడక బెట్టి ప్రతిపూట నాలుగేసి తింటుంటే వీటి నుండి బయటపడే అవకాశము ఉంటుంది. కీళ్ళనొప్పులు, వాపులు ఉన్నవారు, నీరు ఉల్లి పాయలను పొయ్యిలో వేసి కాల్చి మెత్తగా నూరి ఆ పదార్థంతో మందంగా పట్టు వేస్తే నొప్పులు తగ్గుతాయి.
 
శరీరంలో తిమ్మెరలు అధికంగా వున్నపుడు రోజుకు మూడుసార్లు పచ్చి నీరుల్లిపాయను బాగ నూరి ఆ గుజ్జుతో మర్దన చేయడం వలన రక్తప్రసరణ సరిగ్గా జరిగి తిమ్మెరలు తగ్గిపోతాయి. తేలు కుట్టినప్పుడు ఉల్లిపాయ గుజ్జును రుద్దితే ఉపశమనంగా వుంటుంది. నరాల నిస్సత్తువ పోవాలంటే రోజుకో నీరుల్లి పాయను మజ్జిగతో తింటే సరిపోతుంది.