గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 మే 2023 (15:01 IST)

ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు ఏంటి?

green leaves
సాధారణంగా ఇపుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవటానికి పౌష్టికాహార నిపుణులు కొన్ని రకాల ఆహారాన్ని తినమని సూచిస్తున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 
 
ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి విటమిన్ బి అందదు. అందువల్ల శరీరానికి విటమిన్ బి అందిస్తే చాలా మేరకు ఒత్తిడి తగ్గుతుంది. ఆకుకూరల్లోను, పచ్చి బఠానీలలోనూ విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఒత్తిడి తగ్గించుకోవాలనుకొనే వారు వారంలో కనీసం నాలుగు సార్లు పచ్చిబఠానీలు. ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. వీటి వల్ల శరీరానికి మెగ్నీషియం కూడా అందుతుంది. 
 
ప్రతి రోజూ క్యారెట్ వంటి గట్టిగా ఉండే పచ్చికూరలు తినటం కూడా మంచిదే. మన శరీరంలో విడుదలయ్యే స్లైస్ హార్మోన్లను నియంత్రించటంలో విటమిన్ సి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు విటమిన్ సి ట్యాబ్లెట్స్ వాడటం మంచిది.
 
కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే అన్నం, పప్పు వంటివి సెరోటోనిన్ ఎక్కువగా విడుదలయ్యేందుకు తోడ్పడతాయి. సెరో టోనిన్ ఎక్కువగా విడుదలయితే ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నఆహారం తినటం మంచిది.