Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీట్ రూట్ తినేవారికి ముఖ్యమైన సమాచారం..

బుధవారం, 3 జనవరి 2018 (21:11 IST)

Widgets Magazine
beetroot juice

మార్కెట్లో లభించే కూరగాయల్లో బీట్రూట్ ఒకటి. రక్తం రంగులో ఉన్న బీట్రూట్‌ను ఎంత ఎక్కువ తింటే మన శరీరానికి అంత రక్తాన్ని ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. చక్కటి రంగే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్ రూట్ జ్యూస్‌ని సేవిస్తే శక్తి పెరిగి క్రీడా సామర్థ్యం పెరుగుతుందని క్రీడాకారులు ఎక్కువగా ఈ జ్యూస్‌ను తాగుతుంటారు. అంతేకాదు చక్కటి కంటి చూపు కోసం కూడా బీట్‌రూట్‌ను వాడతారు.
 
బీట్‌రూట్స్‌లో మెగ్నీషియం, బయో ప్లేవనాయిడ్‌లు ఉంటాయి. చర్మ సౌందర్యం పెరగడానికి, శరీరంలో ట్రై గ్లిసరేడ్‌ల శాతం తగ్గించడానికి బీట్‌రూట్ ఉపయోగపడుతుంది. ట్రై గ్లిసరేడ్‌లు తగ్గితే రక్తంలోని కొవ్వు కూడా తగ్గుతుంది. శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి కావడానికి బీట్‌రూట్ సహకరిస్తుంది.
 
ఇన్ని సుగుణాలు ఉన్న బీట్ రూట్లో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. హెమో క్రొమోటోసిస్, వీసర్ వ్యాధితో బాధపడేవారు బీట్‌రూట్‌ను అతిగా తినకూడదు. దీనివల్ల శరీరంలో ఎక్కువ స్థాయిలో కాపర్, ఐరన్ నిల్వలు పేరుకుపోతాయి. శరీరంలో అధిక స్థాయిలో ఐరన్ నిల్వలు పేరుకుపోవడం హెమో క్రొమోటోసిస్ వ్యాధి అంటారు. అంతేకాదు మూత్రం ఎర్రగా రావడం, రక్తం ఎక్కువగా ఎర్రపడటం జరుగుతుందట. రక్తం ఎర్రపడితే సమస్య లేదు గానీ దీనివల్ల ఎన్నో రకాల సైడ్‌ ఎఫెక్ట్ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
బీట్‌రూట్ వల్ల కొంతమందిలో వికారంతో పాటు డయేరియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు అస్సలు బీట్‌రూట్ తినకూడదు. అధిక రక్తపోటు ఉన్నవారికి బీట్ రూట్ మంచిదే. అయితే అధిక రక్తపోటుకు మందులు వాడే వారు బీట్ రూట్‌ను తక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. 


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గోరు వెచ్చని నీరు తాగితే... (video)

గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్టు జపాన్ పరిశోధకులు తెలిపారు. ఈ ...

news

మీ స్మార్ట్ ఫోనూ... మీ ల్యాప్‌ట్యాపూ... మీ టీవీ... మరి మీ కళ్లూ...?

దేవుడు మనిషికి రెండు కళ్లను ఇస్తే, మనిషి స్వయంకృతాపరాధంతో మరో రెండు కళ్లను కొని ...

news

గ్రీన్ టీ రోజుకు రెండు కప్పులే తాగాలి..

గ్రీన్ టీని రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. గ్రీన్ టీతో చెడు ...

news

శీతాకాలంలో క్యాబేజీ తురుము సూప్ తాగితే..

శీతాకాలంలో క్యాబేజీ తురుము సూప్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బరువు ...

Widgets Magazine