శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (17:01 IST)

పరగడుపున నీళ్లు తాగితే బరువు తగ్గొచ్చు..

పరగడుపున మంచినీరు తాగడం వల్ల అసాధారణమైన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా పని చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేవగానే కనీసం ఒక లీటరు నీటిని తాగడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే, నీరు తాగిన తర్వాత కనీసం ఓ గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. 
 
అంతేకాకుండా, పరగడుపున నీరుతాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. అలాగే, కొత్త రక్తం తయారీకి, కండర కణజాల అభివద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఉదయాన్ని నీటిని తాగడం వల్ల 20 నుంచి 25 శాతం మేరకు శరీర మెటబాలిజాన్ని పెంచుకుంది. ఇది శరీర బరువును తగ్గిస్తుంది. శరీరంలో ద్రవపదార్థాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా పోరాడుతుంది.