గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 8 ఆగస్టు 2014 (15:12 IST)

శరీర బరువు తగ్గేందుకు ఇదొక ట్రిక్....

ఆహారాన్ని నమిలి తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే తాజాగా కంటెర్‌బర్రీ నిర్వహించిన సర్వేలో ఆహారాన్ని నమిలి తినడం తగ్గించడమే కాకుండా పరిమిత ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని తేలింది. యూనివర్శిటీ ఆఫ్ కాంటెర్‌బర్రీ బృందం నిర్వహించిన సర్వేలో ఆహారాన్ని మితంగా తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించడం సులభమవుతుందని సర్వే తేల్చింది. 
 
ఆహారాన్ని మెల్లగా నమిలి తినడం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్లడంతో బరువు పెరగడాన్ని నియంత్రించడం వీలవుతుంది. అలాగే ఆహారాన్ని కొరికి తినడంతో బరువు తగ్గే ఆస్కారముందని తేలింది. అంతేకాకుండా ఈ బృందం ఆన్‌లైన్ డైట్ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహించారు. దీనికి ఆస్పైర్ అనే పేరు పెట్టారు. ఈ సర్వేను ఒటాగో విశ్వవిద్యాలయంలో లేబొరేటరీ పరీక్షలు కూడా నిర్వహించారు.