శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 29 జులై 2019 (21:31 IST)

క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి తీసుకుంటే...?

ప్రకృతిలో సహజసిద్దంగా లభించే క్యారెట్లో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యారెట్ రసం తీసుకోవడం వలన శరీరంలో వ్యర్దంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది. అయితే క్యారెట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.
 
1. క్యారెట్లో ఎ, సి, కె, మిటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఎ విటమిన్ ఊపిరితిత్తులలో కఫం చేరకుండా చేస్తుంది. ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
 
2. క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి తీసుకోవడం వలన జలుబూ, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి.
 
3. ఒక గాజు సీసాలో పలుచగా కోసిన రెండు క్యారెట్ ముక్కలు, చెంచా అల్లం తరుగూ, కొద్దిగా నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె వేసి మూత పెట్టాలి. మరుసటి రోజు ఈ నీటిని తాగితే జీర్ణ సంబందిత సమస్యలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలు దృడంగా మారతాయి. కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
4. క్యారెట్ జ్యూస్ తాగడం వలన కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే చర్మ సంబంధిత అనారోగ్యాలు దూరమవుతాయి.
 
5. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం తాజాగా కనిపించాలన్నా క్యారెట్ రసాన్ని మించింది లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్యారెట్ రసాన్ని తరచూ తీసుకోవడం వలన శరీరంలో వ్యర్థంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది.