శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (15:08 IST)

కాఫీ తాగనిదే వుండలేరు, ఐతే కాఫీ చెడు లక్షణాలు ఏమిటో..? (Video)

ఉదయం, సాయంత్రం కాఫీ తాగనిదే చాలామంది వుండలేరు. కాఫీ తాగటం వల్ల కొంత మంచి జరిగినా ఇంకొంత చెడు కూడా జరుగుతుంది. కాఫీలో వుండే చెడు గుణాలు ఏమిటో చూద్దాం.
 
కెఫిన్‌ రక్త నాళాలను కుదించడం వలన రక్తపోటు పెరిగే అవకాశం వుంటుంది. ఫలితంగా అధిక రక్తపోటు కారణంగా అనేక గుండె జబ్బులు, గుండె పోటు, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం వుంది.
 
కెఫిన్‌ శరీరంలో చలన కదలికలు నియంత్రించడం వలన చేతులు వణకడం అనే సమస్య తలెత్తవచ్చు. కెఫిన్‌ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అతిమూత్రము సమస్య వస్తుంది.
 
కెఫిన్‌ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గాబరాని కలుగుజేస్తుంది. కెఫిన్‌ అలవాటుగా మారి అది త్రాగడం మానివేసే పక్షంలో కొందరిలో తలనొప్పి, అలసట, నీరసం, సమయస్పూర్తి లోపం కలుగుతుంది. ఇది నిద్రలేమికి కూడా దారి తీస్తుంది. అందుకే కాఫీని పరిమితంగా తీసుకోవాలి.