శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By జగదీష్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (21:44 IST)

ఆవుపాలు ఎంత శ్రేష్టమో తెలుసా...!

కొంతమంది పాలు చూస్తూనే భయపడిపోతుంటారు. పాలు తాగాలంటేనే ఇష్టపడరు. చిన్నపిల్లలు కూడా పాలంటే ఇష్టపడరు. చిన్నపిల్లలు కూడా పాలంటే తూరంగా వెళ్ళిపోతుంటారు. కానీ పాలులో ఉన్న గుణాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. పాలు వల్ల ఎంత ఉపయోగమే చూడండి..
 
కొంచెము పలుచగా ఉంటాయి, త్వరగా జీర్ణమవుతాయి. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము, అలాగే మనిషిలో చలాకీని పెంచుతుందని, ఉదార సంబంధమైన జబ్బులు తగ్గుతాయి. ప్రేగులలో క్రిములు నశిస్తాయని, జ్ఞాపకశక్తిని పెంచుతాయని, చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయని, మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
సాత్విక గుణమును పెంచుతాయని, సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు. యజ్ఞాలకు, హోమాలకు ఆవుపాలను వాడుతారు. దేవాలయములలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారని, కార్తీక పురాణములో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని
వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
గోవు దేవతా స్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చింది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.  ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో ఏర్పడే మనస్సు బుద్ధి రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.