1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (20:03 IST)

వేసవి కాలం... పెర్‌ఫ్యూమ్స్ ఎలా వాడాలి?

పొడి చర్మం కలవారికి పెర్‌ఫ్యూమ్స్ పరిమళాలు తక్కువసేపు వుంటుంది. జిడ్డు చర్మం కలవారికి ఎక్కువసేపు వుంటుంది. కస్తూరి, శాండల్వుడ్ కలిసిన పెర్‌ఫ్యూమ్స్ ఎక్కువసేపు చర్మం పైన గుభాళిస్తాయి. వేసవిలో సెంటు వాసన ఎక్కువసేపు వుండదు. అందువల్ల హెర్బల్ ఆకులతో చేస

పొడి చర్మం కలవారికి పెర్‌ఫ్యూమ్స్ పరిమళాలు తక్కువసేపు వుంటుంది. జిడ్డు చర్మం కలవారికి ఎక్కువసేపు వుంటుంది. కస్తూరి, శాండల్వుడ్ కలిసిన పెర్‌ఫ్యూమ్స్ ఎక్కువసేపు చర్మం పైన గుభాళిస్తాయి. 
 
వేసవిలో సెంటు వాసన ఎక్కువసేపు వుండదు. అందువల్ల హెర్బల్ ఆకులతో చేసిన పెర్‌ఫ్యూమ్స్ వాడటం మంచిది.
 
పెర్‌ఫ్యూమ్స్ మనిషి హుందాతనం పెంచుతాయి. పుష్ప సంబంధ పెర్‌ఫ్యూమ్స్ యువతీయువకులు వాడాలి.
 
మషాలా వంటలు... ముఖ్యంగా వెల్లుల్లి తిన్న తర్వాత పెర్‌ఫ్యూమ్స్ వాడకూడదు.
 
అలాగే ఆందోళనలు, ఆలోచనలు ఎక్కువగా వున్నప్పుడు కూడా వీటిని వాడరాదు. 
 
ఒకేసారి రెండుమూడు రకాల పెర్‌ఫ్యూమ్స్ వాడకూడదు.
 
స్నానపు నీటిలో కలిపే పెర్‌ఫ్యూమ్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. వాటిని కూడా వాడుకోవచ్చు.