శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (22:12 IST)

వేసవిలో కంటి ఆరోగ్యం కోసం...

సాధారణంగా ముఖానికి సౌందర్యాన్ని ఇచ్చేవి కళ్లు. అటువంటి అందమైన కళ్లను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం కారణంగానూ, సరైన విశ్రాంతి లేకుండా ఉండడం, మనం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వలన కంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో కంటి సంరక్షణ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవి తాపం నుండి కళ్లను కాపాడుకోవచ్చు.
 
1. మన కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే  శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవాలి. విటమిన్ ఎ కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన మనం కంటి సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
 
2. వేసవిలో పొడి వాతావరణం వలన పెరిగిన దుమ్ము, తేమ వలన కళ్లల్లో ఎర్రదనము వస్తుంది. వీటితో పాటు కంటి రెప్పల మీద కురుపులు వస్తాయి. కాబట్టి కళ్లను తరచూ కడుగుతూ ఉండాలి.
 
3. వేసవిలో పెరిగే ఉష్ణోగ్రత, సూర్యుని తీవ్రతను నుండి కంటిని రక్షించుకునేందుకు రంగుటద్దాలు ధరించడం మంచిది.
 
4. కంటిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా వైద్య పరీక్షకు వెళ్లి డాక్టకు సూచన మేరకు మాత్రమే మందులు వాడాలి. సొంతగా కంటిచుక్కలు వేసుకోవడం లాంటివి చేయకూడదు.