సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 27 జులై 2016 (12:59 IST)

జామ పండు, జామ ఆకులు... తింటే ఇవన్నీ తగ్గుతాయి...

జామపండు తినటానికి అందరు ఇష్టపడతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగా మాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి త

జామపండు తినటానికి అందరు ఇష్టపడతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగా మాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు చెపుతారు.
 
* అతి తక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి, ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.
* ఎక్కవ పీచు పదార్థం(ఫైబర్) కలిగి ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
* వయసుకు ముందే ముఖంపై ముడతలు, చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.
* ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
* స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.
 
* దీనిలో విటమిన్ ఎ, ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్, లైకోపిన్ ఉండటం వల్ల ఊపిరితిత్తులకు, చర్మానికి, కంటికి చాలా మంచిది.
* అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయలో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
* జామకాయలో ఉండే పొటాషియం గుండె జబ్బులు, బిపి పెరగకుండా చేస్తాయి.
* అంతేకాకుండా జామకాయలో బి కాంప్లెక్స్ విటమిన్స్(బి 6, బి 9) ఇ, కె విటమిన్లు ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.
 
* ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి త‌గ్గి, వ్యాధి నిరోధక శక్తి పెరిగి, అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
* గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
* జామపండు చెట్టులోని ఆకులను(కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.