శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (21:51 IST)

నేరేడు గింజల పొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకుంటే?

నేరేడు పండు గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజూ 3 గ్రాముల చొప్పును నీళ్ళలో కలుపుకుని తీసుకుంటే మధుమేహ వ్యాధికి చక్కని ఉపయోగపడుతుంది. ఈ పొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకోవడం వలన కడుపునొప్పి, విరేచన

నేరేడు పండు గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజూ 3 గ్రాముల చొప్పును నీళ్ళలో కలుపుకుని తీసుకుంటే మధుమేహ వ్యాధికి చక్కని ఉపయోగపడుతుంది. ఈ పొడిని మజ్జిగలో కలుపుకుని తీసుకోవడం వలన కడుపునొప్పి, విరేచనాలకు మంచి ఔషధంగా సహాయపడుతాయి.
 
ఈ నేరేడు పండ్లలో క్యాల్షియం, పాస్పరస్, ఇనుము, విటమిన్ సి, బ ఉండడం వలన శరీరానికి చల్లదనం చేకూరుతుంది. ఈ పండ్లను రెండు లేదా మూడు పండ్లను తేనెలో గానీ, ఉప్పులో గానీ ముంచుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే మూలశంక వ్యాధిని పూర్తిగా నయంచేసుకోవచ్చును. 
 
నేరేడు చెక్కను కాల్చుకుని పొడిచేసి ఉదయాన్నే పరగడుపున గ్లాస్ నీటిలో కలుపుకుని తీసుకుంటే డయోబెటిస్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులకు చక్కని పనిచేస్తుంది. రక్తంలోని కొవ్వును కరిగించుటకు నేరేడు పండ్లు లేదా విత్తనాలు చక్కగా ఉపయోగపడుతాయి.