మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (10:23 IST)

ప్రతిరోజూ ఉదయాన్నే కాకరకాయ జ్యూస్ తీసుకుంటే?

కాకరకాయలో ఆయుర్వేద గుణాలు ఎన్నో ఉన్నాయి. కాకరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. కాకరకాయ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తాగినట్లైయితే శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వె

కాకరకాయలో ఆయుర్వేద గుణాలు ఎన్నో ఉన్నాయి. కాకరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. కాకరకాయ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తాగినట్లైయితే శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఈ జ్యూస్‌ను తరుచుగా తీసుకోవడం వలన అధిక బరువు కూడా తగ్గుతారు.
 
శరీరంలోని కొవ్వును కరిగించే పలు ఎంజైమ్‌లు కాకరకాయలలో అధికంగా ఉన్నాయి. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా ఉంటుంది. మధుమేహా వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు కాకరకాయ జ్యూస్ ‌దివ్యౌషధం పనిచేస్తుంది. 
 
ఈ కాకరకాయ జ్యూస్‌లో తేనె, క్యారెట్ జ్యూస్, యాపిల్ జ్యూస్ వంటి పదార్థాలు కూడా కలుపుకుని తీసుకోవచ్చును. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.