శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 జులై 2016 (17:27 IST)

వంకాయలు తినండి.. బరువు తగ్గండి..!

బరువు తగ్గాలా..? ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువ మొత్తంలో ఉండే కేలరీలను కలిగి వుండే ఆహారం, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో ఎక్కువ సోడియం, తక్కువగా విటమిన్, మినరల్ స్థాయిలను

బరువు తగ్గాలా..? ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువ మొత్తంలో ఉండే కేలరీలను కలిగి వుండే ఆహారం, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో ఎక్కువ సోడియం, తక్కువగా విటమిన్, మినరల్ స్థాయిలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకొని, పోషకాహర లోపానికి గురవకుండా జాగ్రత్తపడాలని వారు సూచిస్తున్నారు. నీరు లేదా ఇతర ద్రావణాలు బదులుగా పోషక విలువలు కలిగినట్టి పండ్ల రసం, పాలను ఎంచుకోవాలి. 
 
తక్కువ పోషకాలు కలిగిన లేదా ఎక్కువ ఫాట్‌లున్న ద్రావణాలకు బదులుగా ఇంట్లో ఉండే తాజా పండ్లు తీసుకోవడం మంచిది. నట్స్, సీడ్స్, ఎండిన పండ్లు, తాజా పండ్ల వలన పోషకాలను పొందటమే కాకుండా సులభంగా బరువు తగ్గొచ్చు.
 
ఇంకా వంకాయల్ని రెగ్యులర్‌‍గా తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తంలోని కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వంకాయలోని కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. వంకాయను ఉడికించి దానితో తేనె చేర్చి సాయంత్రం పూట తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. కాయను వంటల్లో చేర్చడం ద్వారా గుండె, రక్తనాళాల్లో ఏర్పడే వ్యాధులను నిరోధించవచ్చు. 
 
వంకాయలోని  పొటాషియం రక్తంలో చేరే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. వంకాయలోని పీచు ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు పెరగడానికి బ్రేక్ వేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.