గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (12:19 IST)

చలికాలంలో ఖర్జూరాలు తింటే ఎన్ని లాభాలో...

సంప్రదాయ పండు ఖర్జూరం. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అమిత ఇష్టంగా ఆరగించే పండు ఇది. ఒక్క ముస్లిం సోదరులే కాదు ప్రతి ఒక్కరూ ఖర్జూరం పండును ఎంతో ఇష్టంగా తింటారు. ప్రతి రోజూ ఖర్జూరం పండును ఆరగించడం వల్ల అనేక అరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా, శీతాకాలంలో ఈ పండును ఆరగించడం ఎంతో మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
సాధారణంగా శీతాకాలంలో చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. దీంతో చర్మ సంరక్షణ చలికాలంలో ఓ సవాల్‌తో కూడుకున్నది. అయితే, ఖర్జూరం పండును ఆరగించడం వల్ల చర్మ సంరక్షణతో పాటు వివిధ రకాల వ్యాధుల బారి నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తుంటారు. 
 
రోజుకు రెండు ఖర్జూరాలు తింటే వేడిశాతం తగ్గకుండా ఉంటుంది. మనసు ఉత్సాహంగా ఉంటుంది. కండరాల్ని గట్టిగా ఉంచడమేకాకుండా, శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గులాంటి రోగాలను దరికి రానివ్వవు. శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చేస్తుంది. ఖర్జూరం పండును తినడం వల్ల రక్తం పెరుగుతుంది. 
 
ఖర్జురాల్లో ఉండే క్యాల్షియం ఎముకలను గట్టిపడేలా చేస్తుంది. చలికాలంలో శరీరంలోని ప్రొటీన్స్‌‌ను సమతుల్యం చేస్తాయి. బి1, బి2, బి3, బి5 విటమిన్స్‌‌ పుష్కలంగా దొరుకుతాయి. ఈ విటమిన్స్‌‌ తక్కువ ఉన్న వాళ్లు వీటిని తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ఖర్జూరాల్లో ఉండే పొటాషియం,సోడియం నాడీవ్యవస్థ చక్కగా పని చేయడానికి ఉపయోగపడతాయి. వీటిలో ఐరన్‌‌ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత ఉన్న వాళ్లు వీటిని తీసుకుంటే రక్తం పెరుగుతుంది. ఖర్జూరాల్లో ఉండే విటమిన్‌‌ 'డి' శరీరాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. వీటిలోని మినరల్స్‌‌ శరీరానికి ఎంతో అవసరం. కాబట్టి చలికాలంలో ఖర్జూరాలు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.