బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (21:59 IST)

ఆషాఢంలో గోరింటాకు, ఆరోగ్యానికి ఎంతో మేలు

Henna
ఆషాఢ మాసం రాగానే మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి. గోరింటను అరచేతులకు, పాదాలకు అప్లై చేయడం వల్ల అందులోని శీతలీకరణ గుణాల వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో వేడి వల్ల వచ్చే చర్మవ్యాధులు, ఉదర రుగ్మతలు వంటివి అదుపులో ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో అనేక సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాన్ని ఇది నిరోధిస్తుంది.

 
గోరింట ఆకులను గ్రైండ్ చేసి చేతులపై ఉంచుకుంటే మీ చేతులపై ఉన్న గరుకుతనం పోతుంది. గోళ్లపై గోరింటాకు రాయడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా వుంటాయి. అలాగే గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే శక్తి హెన్నా ఆకులకు ఉంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే హెన్నా లీఫ్ వాటర్ వైద్యుని సూచన మేరకు తాగడం మంచిది.

 
హెన్నా ఆకులను బాగా గ్రైండ్ చేసి, తలనొప్పిగా ఉన్నప్పుడు నుదుటిపై రాసుకుంటే అన్ని రకాల తలనొప్పి సమస్యలు దూరమవుతాయి. గోరింట ఆకులను నీళ్లలో నానబెట్టి పుక్కిలిస్తే గొంతు బొంగురుపోవడం, గొంతు నొప్పి నయమవుతాయి. గోరింట పువ్వును గుడ్డలో చుట్టి తలపై పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది.