గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (15:40 IST)

గోధుమ ఆకుల జ్యూస్ తాగితే..?

నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నీరు తాగకుండా ఎవ్వరూ ఉండలేరు. ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం శరీరానికి చాలా మంచిది. దీని వలన డిహైడ్రేషన్‌లో ఉండే శరీరం హైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా.. శరీరంలో ఉండే విషతుల్యాలను విసర్జించేందుకు నీరు ఉపయోగపడుతుంది. కేవలం నీరు మాత్రమే కాకుండా.. పానీయాలు తాగితే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి. ఆ పానీయాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
1. నిమ్మరసం అంటేనే శరీరానికి మేలు చేసేదే. ఇందులోని విటమిన్ సి ఉదయాన్నే మిమ్మల్ని చురుగ్గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
 
2. ప్రకృతి ప్రసాందించిన స్వచ్ఛమైన మినరల్ వాటర్ కొబ్బరి నీరు. రోజూ ఉదయాన్నే కొబ్బరి నీరు తాగడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలానే కడుపు ఉబ్బరంతో బాధపడేవారు కొబ్బరి నీటిని తాగి ఉపశమనం పొందవచ్చు.
 
3. ఉదయాన్నే నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఒక కప్పు అల్లం టీ తాగండి.. దీని వలన మీ కడుపులో ఏమైనా సమస్యలు ఉన్నా నయమైపోతాయి.
 
4. గోధుమ ఆకుల జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ప్రేగులను సంరక్షిస్తుంది. దీనికి ఉసిరి లేదా కలబంద రసాలను జతచేస్తే మరిన్ని పోషకాలు లభిస్తాయి.