శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (14:02 IST)

రాగి జావ తాగితే అవన్నీ తగ్గిపోతాయ్...

చలికాలం నాటి చల్లటి వాతావరణంలో రోజువారి ఆహారంగా రాగులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తుంది. దీనిలోని న్యూట్రియన్ ఫాక్ట్స్ అధిక బరువును తగ్గించుటకు మంచి ఔషధంగా సహాయపడుతాయి. రాగులలోని మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 
1. రాగుల్లోని పీచు పదార్థం, ప్రోటీన్స్ రక్తపోటును తగ్గిస్తాయి. రాగులను నూనెలో వేయించి పొడిచేసి గ్లాస్ పాలలో కలిపి తీసుకుంటే.. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. 
 
2. రాగులలో తయారుచేసిన గంజి, జావ వంటి ఆహార పదార్థాలు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తొలగి మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. దాంతో పాటు క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధించే లక్షణాలు రాగుల్లో అధిక మోతాదులో ఉన్నాయి. 
 
3. పాలిచ్చే తల్లులు ప్రతిరోజూ రాగుల పొడిని అన్నం కలిపి సేవిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుటకు రాగులు చాలా దోహదపడుతాయి. తద్వారా రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది. 
 
4. ఆకలి నియంత్రణకు చాలా మంచివి. రాగులు తరచుగా తీసుకోవడం వలన ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. 
 
5. చాలామందికి చిన్న వయసులోనే చర్మం ముడతలుగా ఉంటుంది. అలాంటప్పుడు రాగులలో చేసిన జావ క్రమంగా తీసుకుంటే చర్మం ముడతలు పడకుండా యంగ్‌గా ఉంటారు. 
 
6. శరీర వేడిని తగ్గిస్తుంది. రాగులను నెయ్యిలో వేయించి పొడిచేసి అందులో కొద్దిగా చక్కెర లేదా బెల్లం సేవిస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.