శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (17:13 IST)

స్కిన్ డిజార్డర్‌ను నివారించుకోవాలంటే.. ముల్లంగి తినండి.!

స్కిన్ డిజార్డర్‌ను నివారించుకోవాలంటే ముల్లంగి తినండి అంటున్నారు.. వైద్యులు ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, జింక్ విటమిన్ బి కాప్లెక్స్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముల్లంగిని మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తారు.

క్లెన్సర్‌తో పాటు ఫేస్ ప్యాక్ గాను ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఇంకా అందంగా మార్చుతుంది. చర్మానికి ముల్లంగిని ఉపయోగించడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాదు ఇది చర్మంపై పడ్డ, రాషెస్‌ను, పొడిబారడాన్ని, చర్మపగుళ్లను దూరం చేస్తుంది. 
 
ఇక ఆరోగ్య పరంగా మూత్రపిండాల వ్యాధులను ముల్లంగి నియంత్రిస్తుంది. ను నియంత్రిస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని విషాలను తొలగించడానికి రక్తాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. అలాగే ముల్లంగిని డైలీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా కోలన్, స్టొమక్, కిడ్నీ, ఓరల్ క్యాన్సర్లను దూరం చేసుకోవచ్చు. ఇంకా ముల్లంగి రసంలో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే జ్వరం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.