బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By tj
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2017 (12:33 IST)

మద్యం సేవించేవారి కాలేయం పదిలంగా ఉండాలంటే...

బీరకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అసలు వదిలి పెట్టం. వీటిలో సాధారణ, నేతి బీర అని రెండు రకాలు ఉంటాయి. రెండు రకాల బీరకాయలలోను పీచు, విటమిన్ సి, జింక్, ఐరన్, రిగోప్లోబిన్, మెగ్నీషియం వంట

బీరకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అసలు వదిలి పెట్టం. వీటిలో సాధారణ, నేతి బీర అని రెండు రకాలు ఉంటాయి. రెండు రకాల బీరకాయలలోను పీచు, విటమిన్ సి, జింక్, ఐరన్, రిగోప్లోబిన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. బీరకాయలోని పెప్పడ్స్, ఆల్కలైడ్స్ రక్తంలోని, యూరిన్ లోని చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించడానికి దోహదపడతాయి.
 
బీరకాయ రక్తశుద్ధికి కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని రక్షిస్తుంది. మందుబాబులు తీసుకునే ఆహారంలో బీరకాయను చేరిస్తే వారి కాలేయానికి ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే కామెర్లు వచ్చిన వారు బీరకాయ రసం తాగితే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావని, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని కొన్ని పరిశోధనలో తేలింది. 
 
అల్సర్లు, మంటలతో బాధపడేవారికి బీరకాయ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్-ఎ కంటి బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని వైద్యులు చెబుతన్నారు. ఇందులోని విటమిన్ బి5 చెడు కొలస్ట్రాల్ తగ్గిస్తుంది, అలాగే బి6 అనీమియాను నివారిస్తుంది.