శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:14 IST)

తులసి విత్తనాలను నీటిలో నానబెట్టి...?

తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. అదేవిధంగా వాటి విత్తనాలు కూడా అంతే మేలు చేస్తాయి. వీటిని తరచు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. అలానే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చును. మరి ఈ విత్తనాలు రోజూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఓసారి పరిశీలిద్దాం..
 
తులసి విత్తనాలను మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గ్లాస్ పాలలో కలిపి రోజూ తాగుతుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దాంతోపాటు రక్తనాళాల్లో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. అలానే చాలామందికి వయస్సు పెరిగే కొద్ది చర్మం ముడతలుగా మారుతుంది. ఈ సమస్యను తొలగించాలంటే.. నిత్యం తులసి విత్తనాలను తింటూ ఉండాలి. 
 
తులసి విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఈ విత్తనాలు రోజూ తింటుంటే గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ ఎటాక్‌‍లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. ముఖ్యంగా శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. 
 
శరీరంలోని కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను తులసి విత్తనాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ అడ్డుకుంటాయి. ఈ విత్తనాలు రక్తహీనత సమస్యను తొలగిస్తాయి. అధిక బరువు గలవారు రోజూ పావుకప్పు తులసి విత్తనాలను నీటిలో నానబెట్టుకుని.. ఆపై విత్తనాలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ విత్తనాల్లో కొద్దిగా బెల్లం, పెసరపప్పు కలిపి తింటుంటే మంచిది.