అరటిపువ్వు కూరను పెరుగుతో కలిపి...?

tomato
Last Updated: బుధవారం, 9 జనవరి 2019 (16:41 IST)
కొందరైతే చిన్న చిన్న సమస్యలకే తెగ బాధపడిపోతుంటారు. ఏదో జరిగినట్టు అందరిని భయపెడుతుంటారు. ఇలా చేస్తే.. మీరు ఎదుర్కునే సమస్యలు వారు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో మన కారణంగా ఇతరులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఓసారి...

1. నోటి పూతతో బాధపడేవారు పండు టమోటా తింటే నోటి పూత నుండి ఉపశమనం లభిస్తుంది.

2. చర్మం కాలినప్పుడు వెనిగర్‌లో ముంచిన బంగాళాదుంప ముక్కతో రుద్దితే మంట తగ్గడమే కాకుండా బొబ్బలు అంతగా ఏర్పడవు.

3. దంతాల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉంటే దంత వైద్యుడి దగ్గరకు వెళ్లి ఫిల్లింగ్ చేయించుకోవాలి.

4. తలుపు సందులో వేళ్ళు పడి నొప్పిగా ఉంటే వెంటనే ఒక్క నిమిషం చన్నీటిలో ఉంచండి. తర్వాత తులసి ఆకును మెత్తగా దంటచి కట్టుకట్టండి ఫలితం ఉంటుంది.

5. అరటిపువ్వు కూరను పెరుగుతో కలిపి ఆహారంగా తీసుకుంటే స్త్రీలకు బహిష్టు సమయంలో నొప్పులు రావు.

6. టమోటా, బీట్‌రూట్, కాబేజీ, తోటకూర కాడల రసాన్ని తాగితే బరువు తగ్గుతారు.

7. నల్ల నువ్వులు బాగా నమిలి తిని చల్లటి నీరు తాగితే కదిలే దంతాలు బలపడుతాయి.దీనిపై మరింత చదవండి :