వేసవిలో కొబ్బరి బొండాం.. మజ్జిగ తాగితే జలుబు చేస్తుందా?

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (14:53 IST)

వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ  వేడి తాపాన్ని దాహాన్ని తీర్చడం కోసం నీరు ఎక్కువగా తీసుకోవడంతో పాటు పుచ్చకాయ, కర్బూజ వంటి నీటి శాతం ఎక్కువ గల పండ్లను తీసుకోవాలి. వేసవిలో కొబ్బరిబొండాం, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు చేస్తాయి.

పండ్ల రసాల ద్వారా తీసుకోకుండా.. పండ్లను అలాగే తినడం మంచిది. తద్వారా పండ్ల మేలు రెట్టింపు అవుతుంది. వేసవిలో నీటితో పాటు నిమ్మరసంలో తేనె, పంచదార, చిటికెడు ఉప్పు కలిపి సేవిస్తే దాహం తీరుతుంది.
 
వేసవిలో చర్మ సంరక్షణకు గంధం, శెనగపిండి, పెసర పిండిని సమపాళ్లలో తీసుకుని పేస్టులా ఒళ్లంతా రాసుకుని 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. తద్వారా చర్మ రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు. వేసవిలో తడి బట్టలను ధరించకూడదు. కాటన్ దుస్తుల్నే ధరించాలి.

ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేయాలి. వారంలో రెండు రోజులు తలంటు స్నానం చేయాలి. రోజు మార్చి రోజు రాత్రిపూట మెంతుల్ని నానబెట్టి.. ఉదయం పూట పేస్టులా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
 
వేసవిలో కొందరికి కొబ్బరి బొండాం, మజ్జిగ తాగితే జలుబు చేస్తుంది. అలాంటి వారు చిటికెడు మిరియాల పొడిని చేర్చి తీసుకుంటే.. జలుబు ఉండదు. ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్, కీరదోస, అరటికాడ, గుమ్మడి, పొట్లకాయ వంటి కూరగాయలను సలాడ్ల రూపంలో తీసుకోవాలి.

సలాడ్లలో ఉప్పు, మిరియాల పొడి చిటికెడు చేర్చుకోవచ్చు. వేసవిలో వేడి ఎక్కువైతే.. జీలకర్ర, మెంతుల పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట రాగి, సజ్జలు, మొక్కజొన్న, గోధుమ, బార్లీ పిండితో తయారైన జావను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బియ్యం కడిగిన నీటితో ప్రయోజనాలు

బియ్యం కడిగిన నీరే కదా.. అని పారబోసేస్తున్నారా? కాస్త ఆగండి. బియ్యం కడిగిన నీటిని చర్మ, ...

news

ఎండు ద్రాక్షలు తినండి.. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టండి..

ఎండు ద్రాక్షలను రోజూ తీసుకునేవారిలో గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును ఎండుద్రాక్ష ...

news

కరివేపాకు పొడిని, పచ్చడిని ఆహారంలో భాగం చేయాల్సిందే..

కరివేపాకులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కరివేపాకు కొలెస్టరాల్‌ను, మధుమేహాన్ని, బీపీని ...

news

కాకర కాయ రసం తీసుకునే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలా తీసుకోవాలంటే...

షుగర్ వ్యాధి అనగానే ఏది తినాలన్నా భయమేస్తుంది. అందుకనే వ్యాధి సంక్రమిస్తే జీవనశైలిలో చాలా ...