గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : గురువారం, 5 మే 2016 (09:22 IST)

చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా.. అయితే, చెంచా బ్రాందీతో చెక్ పెట్టండి?

చాలా మందికి చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుపడుతుంటారు. ఈ రక్తస్రావ సమస్యకు ఇంట్లోనే చెక్ పెట్టొచ్చు. 
 
చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంటే ఒక లీటరు గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా బ్రాందీ, రెండు చుక్కల లెమన్ ఆయిల్, ఒక చుక్క లెవెండర్ ఆయిల్, ఒక చుక్క యూకలిప్టస్ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని పుక్కలించాలి. ఇలా రోజంతా చేసినట్టయితే రక్తస్రావానికి చెక్ పెట్టొచ్చు. 
 
అలాగే, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే, వాటికి సరైన పోషక పదార్థాలు అందివ్వకపోతే దంత సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల దంతాలకు ఎలాంటి హాని కలుగకుండా ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలతో జాగ్రత్తగా పరిరక్షించుకోవాలని సలహా ఇస్తున్నారు.