శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 జులై 2017 (10:57 IST)

అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గుతాయట.. పైల్స్‌కు సజ్జలు...?

ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతు

ప్రతిరోజూ మధ్యాహ్నం పూట, అలాగే రాత్రి భోజనం చేసిన పిమ్మట కొద్దిగా బెల్లం తినడం ద్వారా శరీరంలో జీర్ణశక్తి పెరగడంతో పాటు శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారానాళాలు శుద్ధి అవుతాయి. రక్తం కూడా వృద్ధి చెందుతుంది. అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ని దరి చేరనివ్వదు. మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి వుంది. 
 
సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. జామపళ్లు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్‌లు శిరోజాలకు మేలు చేస్తాయి. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని వైద్యులు చెప్తున్నారు.