శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 14 జనవరి 2015 (18:18 IST)

నిద్రకూ ఓ లెక్కుంది.. నిద్రలేవాలంటే..?

ఎప్పుడు నిద్రపోయారన్నది ముఖ్యం కాదు. ఎప్పుడు నిద్రలేవాలనుకుంటున్నారన్నదే ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. ఆ నిద్రలేవాలనుకునే సమయం నుంచి 90 నిమిషాలు (గంటన్నర) వెనక్కి లెక్కబెడుతూ రావాలి. అయిదు గంటన్నరలు పూర్తయిన సమయంలో మీరు నిద్రకు ఉపక్రమించాలి.
 
ఉదాహరణకు మనం రేపు ఉదయం 8 గంటలకు నిద్రలేవాలనుకుందాం. అక్కడి నుంచి ఐదు గంటన్నరలు వెనక్కి (ఆ వరుస 8.00, 6.30, 5.00, 3,30, 2.00, 12.30, 11.00) లెక్కగట్టి ఆ సమయానికి పడుకోవాలి. అంటే రాత్రి 11 గంటల నుంచి 12.30 గంటల మధ్య పడుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.