శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (14:46 IST)

గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే.. ఇలా చేయండి?

ఈ కాలంలో గుండె జబ్బులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. దీనికి కారణం పూర్తిగా మారిపోయిన జీవనశైలే కారణం. ఫలితంగా యుక్త వ‌య‌స్సులో ఉన్న వారు కూడా గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. దీంతో యేటా గుండె జ‌బ్బుల కార‌ణంగా మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. 
 
అయితే గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే.. నిత్యం వ్యాయామం చేయాలి. స‌రైన పోష‌కాల‌తో కూడిన పౌష్టికాహారాన్ని వేళ‌కు తీసుకోవాలి. ఒత్తిడిని త‌గ్గించుకోవాలి. ధూమ‌పానం, మ‌ద్య‌పానం మానేయాలి. వీటితోపాటు కింద సూచించిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం ద్వారా గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే, ఎలాంటి ఆహారం తీసుకుంట గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చో ఓసారి తెలుసుకుందాం. 
 
* నిమ్మ‌జాతి ఫలాలతో పాటు బాదం ప‌ప్పు, దానిమ్మపండ్ల‌ను క్రమ తప్పకుండా తీసుకున్నట్టయితే గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు.
* ట‌మాటాల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. 
* ట‌మాటాల్లో ఉండే పొటాషియం హైబీపీని త‌గ్గిస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్త నాళాల్లో కొవ్వు గ‌డ్డ క‌ట్ట‌కుండా ఉంటుంది. 
* ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజ‌రైడ్ల‌ను త‌గ్గించ‌డంలో వాల్‌న‌ట్స్ అమోఘంగా ప‌నిచేస్తాయి. 
* వాల్‌న‌ట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. 
* డ‌యాబెటిస్‌, హైబీపీని అదుపులో ఉంచుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. 
* నిత్యం పాల‌కూర‌ను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవచ్చు. 
* పాల‌కూర‌లో ఉండే విట‌మిన్ సి, బీటా కెరోటీన్, ఇత‌ర పోష‌కాలు చెడు కొల‌స్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. 
* పాల‌కూర‌లో ఉండే ఫొలేట్‌, విట‌మిన్ బి6, బిటైన్‌, అమైనో ఆమ్లాలు గుండె జ‌బ్బులు, స్ట్రోక్స్ రాకుండా చూస్తాయి. 
* ఓట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌కుండా చూస్తాయి. 
* శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను అంతం చేస్తాయి. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి.