గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 7 పాయింట్లు చూడండి...

Last Updated: గురువారం, 6 డిశెంబరు 2018 (13:31 IST)
చూడడానికి చిన్నదే కానీ ఎంతటి మనషినైనా నిలబెడుతుంది. గుండె బలం అలాంటిది. లబ్‌డబ్ అని కొట్టుకుంటూ.. అన్ని అవయవాలకు రక్తాన్ని పంపుతుంది. ఇలాంటి గుండెను జాగ్రత్తగా కాపాడుకోవడానికి కొన్ని పద్ధతులు..
 
1. వాహనాలు, లిఫ్ట్‌లు వచ్చిన తరువాత శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. వీలైనప్పుడంతా నడవడం, మెట్లు ఎక్కడం ద్వారా గుండెను ఆరోగ్యంగా వుంచుకోవచ్చు.
 
2. అలసట, ఒత్తిడి కారణంగా గుండె వైఫల్యం. గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
3. కార్టిజోల్ వంటి హార్మోన్స్ గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. అందువలన వ్యాయామం చేసి ఇలాంటి హార్మోన్స్ స్థాయిలు ఉద్ధృతం కాకుండా చేసుకోవచ్చు. 
 
4. నిద్రలేమి కారణంగా కూడా రక్తపోటు ప్రమాదం ఉంది. ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. కనుక రాత్రివేళ 7-8 గంటలు నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 
5. నవ్వడం వలన రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన సమయం దొరికినప్పుడల్లా జోక్స్ చదవండి. నవ్వు తెప్పించే సినిమాలు చూడండి.
 
6. గుండె కూడా కండరమే. దీనికి ప్రోటీన్స్ అవసరమే. కాబట్టి చిక్కుడు, బఠాణీలు, చేపలతో పాటు బాదం, పిస్తా వంటి గింజపప్పులు తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. 
 
7. అధిక బరువు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి. దీనిపై మరింత చదవండి :