1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 అక్టోబరు 2014 (16:50 IST)

గుండెను పదిలం చేసుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో చేయాల్సిందే!

గుండెను పదిలం చేసుకోవాలంటే... ఈ టిప్స్ ఫాలో చేయాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. శరీరాన్ని కాపాడుకునే విధానాన్ని బట్టి.. గుండె ఆరోగ్యంగా ఉంటుందో అంచనా వేయవచ్చు. గుండె పదిలంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. 
 
పద్ధతి ప్రకారం ఆహారం తీసుకోవాలి. ప్రయత్నించినా ప్రయోజనం లేదనే ఆలోచన ఉండకూడదు. ప్రయత్నమంటూ చేసుకుంటూ పోవాలి. ప్రతిఫలం తనంతట తానే వరిస్తుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి.  
 
నూనె వస్తువులను తీసుకోవడం తగ్గించండి. పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. ఆహారం మితంగా తీసుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారాన్ని మితంగా తీసుకోవడంతో పాటు జంక్ ఫుడ్‌కు దూరంగా వుండటం ద్వారా గుండెను పదిలం చేసుకోవచ్చు. 
 
మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే సమస్యల పరిష్కారంపై సరైన నిర్ణయం తీసుకోవాలి. కార్యాలయాల్లో ఒత్తిడిని అధిగమించేలా పనిచేయడం నేర్చుకోవాలి. ఇంటి పనుల్లోనూ రూల్స్ పాటించాలి. 
 
అప్పుడే హృద్రోగ వ్యాధులు, గుండెపోటు దరిచేరదు. గత ఏడాది గుండె సంబంధిత వ్యాధులతో మృతుల సంఖ్య 17.1 మిలియన్లుగా ఉండగా, ఈ ఏడాది 17.3 మిలియన్స్‌గా పెరిగిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.