1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 30 ఏప్రియల్ 2022 (00:00 IST)

heat wave warning: వడదెబ్బ తగిలితే తగ్గేందుకు చిట్కాలు

summer
దేశంలో ఎండలు భగభగలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 నుంచి 45 డిగ్రీల్ సెల్సియెస్ ఉష్ణోగ్రతలు కాస్తున్నాయి. విశాఖలో ఎప్పుడో 44 ఏళ్ల క్రితం ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియెస్ ను తాకింది. తాజాగా అదే ఉష్ణోగ్రతను రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు హీట్ వేవ్ పట్ల జాగ్రత్తగా వుండాలని సూచనలు చేస్తున్నాయి. ఐనా కొంతమంది వడదెబ్బ బారిన పడుతున్నారు. వడదెబ్బ తగిలినవారు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే ఫలితం కనబడుతుంది.

 
ఉదయం, సాయంత్రం పచ్చి ముల్లంగి దుంపలు తినిపించాలి. చింతపండు నీటిలో నానబెట్టి రసం తీసి తాళింపు వేసి భోజనంతో పాటు తీసుకోవాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూను పొడిని, ఒక గ్లాసు నిమ్మరసంలో కలిపి, ఉప్పు, పంచదార వేసుకుని తాగాలి. పచ్చి మామిడికాయ ఉడికించి రసం తీసి పంచదార కలిపి తాగించాలి. 

 
ద్రవపదార్థాలు మజ్జిగ, నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు పైన తేటనీరు వంచి చిటికెడు ఉప్పు కలిపి తాగితే వడదెబ్బ నివారించబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.