శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (13:51 IST)

భోజనం తర్వాత కొంచెం వేడీ నీరు తాగితే..?

భోజనం తర్వాత కొంచెం వేడి నీరు తాగడం మంచిది. ఒక రోజుకు 8-10 గ్లాసుల నీటితో పాటు చక్కెర శాతం ఎక్కువగా లేని పండ్ల రసాలను సేవించడం ద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలిగితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా బరువు పెరిగే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మానసిక ఉల్లాసంతో ఆరోగ్యంగా ఉండటం సులువవతుంది. అందుచేత ఆరు మాసాలకో, లేక వీలును బట్టి విహారయాత్రలకు వెళ్ళటం చేయాలి. 
 
సన్నబడ్డానికి ప్రయత్నించే వారు ఆహారాన్ని పూర్తిగా తినడం మానడానికి బదులు. ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తినవచ్చు. అందుకు సూపులు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవచ్చు. 
 
వ్యాయామం అంటే జిమ్‌కు మాత్రమే వెళ్ళి చేసిది కాదు. జిమ్‌కు పోవడానికి ఇష్టం లేని వారు, ఇంట్లోనే స్కిప్పింగ్, బ్యాటింగ్, నడక వంటి అతి సులువైన వ్యాయామాల వల్ల క్రమమైన బరువును కలిగి ఉండవచ్చు.
 
అలాగే వ్యాయామ సమయంలో విశ్రాంతి తీసుకోకూడదు. అరగంట పాటు వ్యాయమం చేసే వారు మద్యలో విశ్రాంతి తీసుకోకూడదు. శరీరంలో చెమటలు పట్టేలా వ్యాయామం చేయాలని, తద్వారా శరీర బరువును నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.