శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 13 మార్చి 2018 (16:02 IST)

ఒత్తయిన జుట్టు కోసం ఏం చేయాలంటే...?

కేశాలను శుభ్రపరచడం, నూనె పెట్టడం, కండీషనర్లు వాడటం, హెన్నా లాంటివి రాసుకుంటాం. ఇవన్నీ జుట్టు ఒత్తుగా పెరగటానికి బయట నుంచి చేసే పనులు. జుట్టు పెరగటానికి లోపలి నుంచి అందాల్సిన పోషకాలు ఏంటో కూడా తెలుసుకుందాం.

కేశాలను శుభ్రపరచడం, నూనె పెట్టడం, కండీషనర్లు వాడటం, హెన్నా లాంటివి రాసుకుంటాం. ఇవన్నీ జుట్టు ఒత్తుగా పెరగటానికి బయట నుంచి చేసే పనులు. జుట్టు పెరగటానికి లోపలి నుంచి అందాల్సిన పోషకాలు ఏంటో కూడా తెలుసుకుందాం.
 
1. చేపల్లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుకు పోషణ అందించే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా వీటి నుంచే లభిస్తాయి. తరచూ చేపల్ని తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా అందంగా మారుతుంది. గుడ్డులో జింక్, సల్పర్, ఐరన్, సెలీనియం లాంటి మూలకాలుంటాయి. ఇవి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి.
 
2. బాదం, వాల్ నట్స్, జీడిపప్పు, గుమ్మడి, పొద్దుతిరుగుడు వంటి విత్తనాల్లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయ ఆహారంగా శాఖాహారులు వీటికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అలానే వీటిలోని విటమిన్ ఇ, బయోటిన్‌లు జుట్టుకి రక్షణనిస్తాయి. జుట్టు రాలకుండా నియంత్రిస్తాయి. వాల్‌నట్స్‌లో ఉండే జింక్ జుట్టుకి సహజమైన రంగును, తేమను అందించి నిగనిగలాడేలా చేస్తుంది.
 
3. ఇక జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేయడంలో ఆకుకూరలు ఎంతో కీలకం. వీటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకలు చిట్లకుండా, పెళుసుగా మారకుండా నిరోధిస్తుంది.
 
4. క్యారెట్ కేవలం కంటికి మాత్రమే కాదు జుట్టుకి మంచిదే. ఎందుకంటే దీనిలో విటమిన్‌ ఎ ఎక్కువుగా ఉంటుంది. విటమిన్ ఎ లోపం వల్ల మాడు ఎండిపోయిట్లై, చుండ్రు సమస్య కూడా కనిపిస్తుంది. కాబట్టి క్యారెట్‌తో పాటు విటమిన్ ఎ ఎక్కువుగా ఉండే చిలకడదుంపలు, గుమ్మడి, మామిడిపండ్లు, ఆప్రికాట్లను ఎక్కువగా తీసుకోవాలి.
 
5. మీగడ తీసిన పాలు, చీజ్ కూడా వెంట్రుకలు చిట్లిపోకుండా కాపాడుతాయి.