శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 8 ఆగస్టు 2017 (22:40 IST)

దానిమ్మకు అంతటి శక్తి వుందా...? శృంగార సామర్థ్యం పెంచుతుందట...

దానిమ్మ పండ్లను రోజుకొకటి తీసుకుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు దానిమ్మతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరానికి కావాల్సిన శక్తినిచ్చిన దానిమ్మ పండును రోజు వారీగా అరకప్పు తీసుకుంటే మంచి ఫలితముంటుందని వారు చెబుతున్నార

దానిమ్మ పండ్లను రోజుకొకటి తీసుకుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు దానిమ్మతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరానికి కావాల్సిన శక్తినిచ్చిన దానిమ్మ పండును రోజు వారీగా అరకప్పు తీసుకుంటే మంచి ఫలితముంటుందని వారు చెబుతున్నారు. 
 
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దానిమ్మలో పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ, సి, ఇ లను దానిమ్మ అందజేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే హృద్రోగ సమస్యలకు దానిమ్మ పండుతో అడ్డుకోవచ్చు. 
 
దానిమ్మ పండ్లను అరకప్పు తీసుకోవడం ద్వారా చెడు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయని, ఊబకాయాన్ని నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మ సమస్యలు నయం అవుతాయి. రక్తప్రసరణ సక్రమంగా సాగడం కోసం దానిమ్మను తీసుకోవాలి. గొంతునొప్పికి దానిమ్మ దివ్యౌషధంగా పనిచేస్తుంది. కనుక దానిమ్మను ప్రతిరోజూ తీసుకోవడం మంచిది.