శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 21 జులై 2017 (19:21 IST)

రక్తంలో కలిసిపోయిన క్రొవ్వును కరిగించడం ఎంత సుళువో తెలుసా?

మనం చాలావరకు వెల్లుల్లి, నిమ్మరసాలను వంటల్లో మసాలా కోసమో... లేకుంటే మంచి రుచి వచ్చేందుకు మాత్రమే వాడుతుంటాం. కానీ ఈ రెండు కలిపితే శరీరానికి గొప్ప ఫలితాలు వస్తాయని చాలామందికి తెలియదు. రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కరిగించేందుకు ఫార్మ

మనం చాలావరకు వెల్లుల్లి, నిమ్మరసాలను వంటల్లో మసాలా కోసమో... లేకుంటే మంచి రుచి వచ్చేందుకు మాత్రమే వాడుతుంటాం. కానీ ఈ రెండు కలిపితే శరీరానికి గొప్ప ఫలితాలు వస్తాయని చాలామందికి తెలియదు. రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కరిగించేందుకు ఫార్మా కంపెనీలు తయారుచేసే మందుల్లో ఉండే పదార్థాలు కూడా ఇవే. రసాయనిక చర్యతో తయారైన మందులు ఎందుకు వాడాలి. సహజసిద్ధంగా ఆ రెండింటిని కలుపుకుని మనమే తాగితే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో సరఫరా మెరుగవుతుంది. 
 
గుండె సంబంధిత సమస్యల నుంచి దీర్ఘాయుష్షు పొందవచ్చు. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగితే గుండెనొప్పి రాదు. ఆ తరువాత జబ్బులే రావు. అధిక బరువు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగితే చాలా మంచిది. 30 వెల్లుల్లి రెబ్బలు, ఆరు నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలను కోసి రసం తీయాలి. వెల్లుల్లి పొట్టు తీసేసి ముక్కులుగా కోయాలి. తరువాత కొద్దిగా నీళ్ళు పోసుకుని రెండింటిని మిక్సీ పట్టాలి. మిక్సీ తరువాత రెండు లీటర్ల నీటిని కలపాలి. తరువాత వచ్చే మిశ్రమాన్ని ఐదు నుంచి పది నిమిషాలు వేడి చేయాలి.
 
ఆ తరువాత వడగట్టి గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని 50 ఎం.ఎల్. చొప్పున ఉదయం పరగడుపున తాగాలి. ఇలా మూడు వారాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. తిరిగి వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ మూడువారాలు తాగాలి. ఇలా ప్రతి ఆరు నెలలు చేస్తే, గుండెకు రక్తాన్ని పంపిణీ  చేసే నాళాల్లో క్రొవ్వు కరిగిపోతుంది.