శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (17:12 IST)

ఉప్పు తగ్గిస్తే ఎంతో మేలు..

కొంతమందికి కాళ్లు చేతులు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అలాంటి వారి శరీరంలో నీటిశాతం ఎక్కువగా వుందని గమనించాలి. అలాంటప్పుడు ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. అలానే ఈ చిట్కాలు కూడా పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే?

కొంతమందికి కాళ్లు చేతులు ఉబ్బినట్లు కనిపిస్తాయి. అలాంటి వారి శరీరంలో నీటిశాతం ఎక్కువగా వుందని గమనించాలి. అలాంటప్పుడు ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. అలానే ఈ చిట్కాలు కూడా పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే? ఉప్పును తీసుకోవడం తగ్గిస్తే ఒంటిలో వుండే నీటిని తగ్గించుకోవచ్చు. నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా ఒక్కోసారి శ‌రీరం ఉబ్బిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి నీటిని కూడా త‌గిన మోతాదులో నిత్యం తాగాల్సిందే.
 
శ‌రీరంలో అధికంగా ఉన్న నీటిని బ‌య‌టికి పంపించ‌డంలో విట‌మిన్ బి6 బాగా ఉపయోగ‌ప‌డుతుంది. కాబ‌ట్టి ఈ విట‌మిన్ ఎక్కువ‌గా ఉన్న పిస్తా ప‌ప్పు, చేప‌లు, అర‌టి పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, పాల‌కూర వంటి ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటే నీరు అంతా బ‌య‌టికి పోతుంది.
 
న‌ట్స్‌, ఆకుప‌చ్చని కూర‌గాయ‌ల వంటి మెగ్నిషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నా ఒంట్లో ఉన్న నీరు బ‌య‌టికి పోతుంది. ప్రధానంగా వీటిని మ‌హిళ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల ఎంతో ఉప‌యోగం ఉంటుంది. చ‌క్కెర‌, పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోకూడదు. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి. జీలకర్రను ఆహారంలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.