Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాన పొట్ట తగ్గాలా... అయితే ఇవి ఆరగించండి...

బుధవారం, 17 మే 2017 (11:38 IST)

Widgets Magazine
belly

చాలా మంది బాన పొట్టతో బాధపడుతున్నారు. దీనికి కారణం... వ్యాయామం చేయకపోవడం, జీవనశైలిలో మార్పుల నేపథ్యంలో బరువుతోపాటు పొట్ట కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు కొవ్వు పదార్థాలు తగ్గించడం మాత్రమే కాదు.. కొన్ని పదార్థాలను రోజూ తీసుకోవాలి. వాటిలోని పోషకాలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా చూస్తాయి.
 
బాన పొట్టతో ఉండే వారు... ప్రతి రోజూ ఉదయం పూట నూనెతో చేసిన అల్పాహారాలకు బదులు ఓట్స్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. జీవక్రియల రేటు వృద్ధి అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. తక్షణ శక్తి అంది ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీనిలోని పీచు కూడా జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్‌ తీసుకునేటప్పుడు అందులో చక్కెరకు బదులు ఏవైనా తాజా పండ్ల ముక్కలూ, రసాలు కలిపితే సహజ చక్కెర్లు అందుతాయి. పొట్ట వస్తుందనే భయం కూడా ఉండదు.
 
మాంసకృత్తులు అధికంగా అందించే గుడ్డు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా తెల్లసొన తీసుకోవడం వల్ల బి12, డి విటమిన్లు, ఒమెగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అధికంగా అందుతాయి. ఇవి బరువు తగ్గడంలో కీలక పాత్రపోషిస్తాయి. దీనివల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. గుండె పని తీరు కూడా మెరుగవుతుంది.
 
ఆకలిగా అనిపించినప్పుడు ఏ మిఠాయిలో, ఇతర చిరుతిళ్లొ తినే బదులు.. పండ్లు ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల చక్కెర్లు, కొవ్వూ అందుతాయన్న బాధ ఉండదు. పోషకాలూ ఎక్కువగా అందుతాయి. బరువూ తగ్గుతారు. మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో నీరు కూడా పేరుకోకుండా ఉంటుంది. ఆ పోషకాలు అందాలంటే బాదంతోపాటు ఇతర నట్స్‌ తినాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బాదం నానబెట్టి ఆరగిస్తే కలిగే ఫలితాలేంటి?

బాదం తింటే మంచిదనీ వీటిల్లో విటమిన్‌-ఇ, పీచు, ఒమేగా-3- ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లూ ...

news

మలబద్ధకం సమస్యకు ఉత్తమ మందు ‘కర్బూజ'

వేసవికాలంలో లంభించే పండ్లలో కర్బూజ ఒకటి. ఇందులో నీటి శాతం పుష్కలంగా ఉంటాయి. వీటిని ...

news

నానబెట్టిన నువ్వులను పాలతో కలిపి తీసుకుంటే...?

నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చూసేందుకు చిన్నవిగా వున్నా వాటి శక్తి ...

news

స్త్రీలకు వార్నింగ్... పురుషులు వాడాల్సినవి పక్కన పడేసి స్త్రీకి గర్భ నిరోధక మాత్రలా?

ఇప్పుడే పిల్లలు వద్దు అని చాలామంది జంటలు పెళ్లయిన తర్వాత అనుకుంటారు. కొంతకాలం సంతోషంగా ...

Widgets Magazine