1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : శనివారం, 9 జులై 2016 (11:53 IST)

ఉప్పు ఎక్కువైతే కూరను పారేయకండి.. బంగాళాదుంపను వేసి..?!

కూరలు చేసేటప్పుడు పొరపాటున ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైపోతుంది. అలాగని ఆ కూరని తినలేం.. అందుకని బయట పడేయలేం. ఉప్పు ఎక్కువ అయితే తినడం చాలా కష్టం, అది కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. అందుకే ఉప్పు ఎక్కు

కూరలు చేసేటప్పుడు పొరపాటున ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైపోతుంది. అలాగని ఆ కూరని తినలేం.. అందుకని బయట పడేయలేం. ఉప్పు ఎక్కువ అయితే తినడం చాలా కష్టం, అది కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. అందుకే ఉప్పు ఎక్కువ అయిన కూరని ఎలా సరి చెయ్యాలి అనే విషయం తెలియజేయడానికి కొన్ని చిట్కాలు...
 
కూరలో ఉప్పు ఎక్కువ అయితే, కొద్దిగా కొబ్బరి పాలు కలిపితే.. ఉప్పు తగ్గడమే కాకుండా కూర ఇంకాస్త రుచిగా తయారవుతుంది. పచ్చి బంగాళాదుంపని తొక్క తీసి, నాలుగు పెద్ద ముక్కలుగా చేసి వాటిని కూరలో వేసి పది నిమషాలు ఉడికిస్తే చాలు.. ఉప్పు తగ్గుతుంది. తినే ముందు ఆ బంగాళాదుంప ముక్కలను తీసేస్తే సరి.
 
కొంచెం పెరుగును కలిపితే ఉప్పు తగ్గడమే కాకుండా కూర రుచిగా కూడా ఉంటుంది. ఉల్లిపాయ, టమాటాని ముద్ద చేసి కొంచెం నూనెలో వేయించి ఆ ముద్దని కూరలో కలిపితే.. ఉప్పు తగ్గుతుంది, రుచి బాగుంటుంది పైగా గ్రేవీ కూడా ఎక్కువగా చిక్కగా అవుతుంది. ఈ చిట్కాలన్నీ ఒక్కొక్క కూరలో ఒక్కోటి బాగుంటుంది, కనుక ఏ కూరలో ఏది వాడితే బాగుంటుందో చూసుకుని చెయ్యండి.