శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (18:47 IST)

పచ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే?

ప్రతిరోజు మనం వంటకాలలో తప్పనిసరిగా ఉల్లిపాయను వాడుతుంటాము. తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుంది అనే నానుడి వాడుకలో ఉంది. ఇంత మంచి ఉపయోగం ఉన్న ఉల్లిపాయ వలన లాభాలేమిటో తెలుసుకుందాం.

ప్రతిరోజు మనం వంటకాలలో తప్పనిసరిగా ఉల్లిపాయను వాడుతుంటాము. తల్లి చేయలేని  మేలు ఉల్లి చేస్తుంది అనే నానుడి వాడుకలో ఉంది. ఇంత మంచి ఉపయోగం ఉన్న ఉల్లిపాయ వలన లాభాలేమిటో తెలుసుకుందాం. 
 
1. వర్షాకాలంలో ఉల్లిని కోసి దాని వాసనను చూస్తే జలుబు త్వరగా తగ్గుతుంది.
 
2. కోసిన ఉల్లిని మన శరీరంపై రాసుకుంటే శరీరంపై ఉండే మచ్చలు పోతాయి. అలాగే చర్మం కూడా మృదువుగా అవుతుంది.
 
3. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది.
 
4. ఉల్లిపాయకు అనేక రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం ఉంది. కనుక ఉల్లిని వాడితే మేలు కలుగుతుంది.
 
5. కేశాలు చాలా అందంగా నిగనిగలాడాలంటే ఉల్లి రసాన్ని తల స్నానం చేసేముందు తలకు మర్దన చేయాలి.
 
6. పచ్చి ఉల్లిపాయ ఎక్కువుగా తినడం వల్ల పురుషులకు వీర్యం వృద్ధి ఎక్కువుగా జరుగుతుంది.