గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (23:33 IST)

ఈ పని చేస్తే చాలు దోమలు పారిపోతాయి

డెంగ్యూ జ్వరం కేసులు ఈమధ్య కాలంలో విపరతీంగా పెరుగుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడంలో కొందరు అలసత్వంగా వుండటం వల్ల దోమకాటుకి గురై విషపు జ్వరాలు తెచ్చుకుంటున్నారు. వెల్లుల్లి దోమల్ని నివారిస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని బాగా దంచి రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరగించాలి. ఈ నీరు చల్లారాక ఇంట్లో అక్కడక్కడా చల్లితే దోమలు రాకుండా వుంటాయి.
 
వేప నూనె కూడా దోమల్ని నివారిస్తుంది. కొబ్బరి నూనె, వేప నూనెలను సమపాళ్లలో తీసుకుని కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ఈ నూనెను నిద్రించే ముందు ఒంటికి రాసుకోవాలి. దీనితో దోమలు దరిచేరవు. లేదంటే తులసి నూనె రాసుకున్నా ఫలితం వుంటుంది. నిమ్మ నూనె, యుకలిప్టస్ నూనె సమపాళ్లలో కలిపి దోమలు ఎక్కువగా తిరిగే చోట చల్లాలి. ఇలా చేస్తే దోమల బెడద వదులుతుంది.