1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (16:07 IST)

బరువును తగ్గించే సులభమైన చిట్కా.. జీలకర్రను పెరుగుతో కలిపి..?

బరువును తగ్గించే సులభమైన చిట్కా.. ఒక టీస్పూన్ జీలకర్రను ఒక టీస్పూన్ పెరుగుతో కలపండి. దీన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తినండి. ఇలా 15 రోజులు పాటు చేస్తే మీరు బరువు తగ్గడం ఖాయం.
 
రాత్రిపూట జీలకర్రను నానబెట్టి.. ఉదయాన్నే అదే నీటిలో మరిగించాలి. తర్వాత ఈ పానీయాన్ని వడకట్టి తాగాలి. మీకు మరింత రుచికరంగా అనిపించాలంటే.. మీరు నిమ్మకాయ రసాన్ని జోడించుకోవచ్చు. ఇలా 2 వారాల పాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దీన్ని తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు.
 
అలాగే రోజూ జీలకర్ర తినడం, దాని జ్యూస్ తాగడం వల్ల బొడ్డు చుట్టూరా ఉన్న కొవ్వుతో పాటు మీ శరీరంలోని ఇతర భాగాల్లో పెరుగుతున్న కొవ్వు కూడా తగ్గుతుంది. జీలకర్ర మీ జీర్ణవ్యవస్థకు సహాయపడి.. పేగులను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. 
 
జీలకర్రలో ఇనుము అధికంగా ఉంటుంది. మనిషి శరీరానికి అవసరమయ్యే ఇనుమును దీని  ద్వారా తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ జీరాలో 1.4 మి.గ్రా ఇనుము కలిగి ఉంటుంది. ఇది శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్స్ తొలగించడానికి ఉపయోగపడుతుంది. జీలకర్ర కొవ్వు కరిగించి, బరువు తగ్గేలా చేస్తుంది.