Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్రష్ ఎలా చేయాలో తెలుసా? చూడండి ఈ సూచనలు...

మంగళవారం, 6 జూన్ 2017 (21:16 IST)

Widgets Magazine

ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందులో బ్రష్ చేసే విధానం గురించి చాలామంది పెద్దగా పట్టించుకోరు. దానికి కూడా కొన్ని దిశానిర్దేశాలున్నాయి. బ్రష్ చేసే విధానంలో ముందుగా బ్రష్‌పై పేస్ట్ వేసుకుని ముందు పళ్లపై పైకి క్రిందికి మూడుమూడు సార్లు రుద్దాలి. ఆ తర్వాత పక్క పళ్లను రుద్దుతూ మీ బ్రష్‌ను వెనుకకు ముందుకు కదపండి. ఆ తర్వాత కుడి- ఎడమవైపుకు తిప్పండి. ఇలా నోట్లోనున్న అన్ని దంతాలకు బ్రష్ చేయండి. దీంతో దంతాలు శుభ్రమై నోట్లో దుర్వాసనను నిరోధిస్తోంది. 
 
ఇదేవిధంగా దంతాలకు దంతాలకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల లోపలకూడా నిదానంగా బ్రష్ చేయాలి. అలాగే దంతాలు నమిలే భాగంలో అంటే పై దంతాలు- కింది దంతాలు పైభాగంలో కూడా వెనుకకు ముందుకు బ్రష్ చేయాలి. బ్రష్‌తో నోట్లోని లోపలి భాగంతోపాటు పైభాగంలోను బ్రష్ చేయాలి. మరికొన్ని సూచనలు
 
* బ్రష్ చేసే సమయంలో నాలుకను కూడా శుభ్రం చేసుకోండి. ఎందుకంటే నాలుకపై కీటాణువులు అధికంగా ఉంటాయి కాబట్టి నాలుకను శుభ్రపరచుకోండి. 
 
* బ్రష్ చేసిన తర్వాత నోట్లో నీరు పోసుకుని బాగా పుక్కలించాలి. తర్వాత దవడలను బాగా మాలిష్ చేసుకోండి. మళ్ళీ నోట్లో నీరు పోసుకుని పుక్కలించండి. 
 
* రాత్రిపూట కూడా బ్రష్ ఇలాగే చేయాలంటున్నారు వైద్యులు. 
 
* బ్రష్ చేసేటప్పుడు మీ శక్తినంతా పళ్లపై ప్రయోగిస్తూ బ్రష్ చేయకండి.
 
* పైన చెప్పిన చిట్కాలను పాటిస్తూ మీ దంతాలను కాపాడుకోండి. తమలపాకు, పొగాకు, గుట్ఖా, సిగరెట్టు తదితరాలను సేవించకండి. కాసింత దంత సమస్య ఏర్పడినట్టుంటే వెంటనే దంత వైద్యనిపుణుడిని సంప్రదించండి. మీరు మీ దంతాలను కాపాడుకుంటుంటే ఆ దంతాలు మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బట్టతలకు గోంగూరకు లింకేంటి..?!!

గోంగూరను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు. గోంగూరలో విటమిన్ - ఎ, బి1, ...

news

హైబీపీని తగ్గించే మందార టీని అల్పాహారానికి తర్వాత తాగితే..?

బరువును తగ్గించడంతో పాటు సౌందర్యాన్ని పెంచేందుకు మందార టీని సేవించండి అంటున్నారు ఆరోగ్య ...

news

అరటిదూటతో ప్రయోజనాలెన్నో.. నెలసరి సమయంలో?

కిడ్నీ సంబంధిత రోగాలను నయం చేసుకోవాలంటే అరటిదూట దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలోని ...

news

లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని పెంచే అరటి.. లైంగిక శక్తి పెరగాలంటే?

అరటి పండులోని పొటాషియం, బి విటమిన్ లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. అందుకే అరటి పండును ...

Widgets Magazine