శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 25 జూన్ 2016 (18:48 IST)

నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే...

నిమ్మరసంలో ఉండే పొటాషియం కారణంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి రాసుకొని ఒక పావుగంట ఉంచి, ముఖం కడిగేస్తే ముఖం కాంతివంతం అవుతుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి నిమ్మకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. నిమ్మ రసాన్ని స్ప్రే చేస్తే ముక్

నిమ్మరసంలో ఉండే పొటాషియం కారణంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి రాసుకొని ఒక పావుగంట ఉంచి, ముఖం కడిగేస్తే ముఖం కాంతివంతం అవుతుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి నిమ్మకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. నిమ్మ రసాన్ని స్ప్రే చేస్తే ముక్కులో నుండి రక్తం కారడం ఆగిపోతుంది. నిమ్మరసంతో మసాజ్ చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. 
 
పన్ను నొప్పి ఉన్న చోట నిమ్మ రసాన్ని పెడితే ఉపశమనం లభిస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే శరీరం నిగనిగలాడుతుంది. లెమన్ టీ త్రాగితే రక్తంలో చెక్కెర శాతం నియంత్రణలోకి వస్తుంది. నిమ్మరసంతో తులసీ, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేడి నీటితో కలిపి తాగితే క్షయ వ్యాధి కొంత వరకు నియంత్రణలోకి వస్తుంది.
 
ఈ రసాన్ని క్రమం తప్పకుండా పుక్కిలిస్తే ప్ళ్ల నుంచి రక్తం కారడం ఆగిపోయి, నోటి దుర్వాసన దూరం అవుతుంది.  నిమ్మరసాన్ని నీటితో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి, గొంతులో రాపిడి వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.