ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (09:59 IST)

పచ్చి మామిడి కాయతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

వేసవికాలంలో పచ్చి మామిడి కాయలు విరివిగా దొరుకుతాయి. చిన్న పిల్లలు వీటిలో ఉప్పు వేసుకుని తినడానికి ఇష్టపడతారు. పచ్చి మామిడి కాయల వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమామిడిని పచ్చడి గాను, కూరల్లో గాను చేర్చి తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. 
 
ఎసిడిటీ వలన బాధపడేవారు చిన్న పచ్చి మామిడికాయ ముక్కను బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే ఉపశమనం పొందవచ్చు. గర్భిణులు వాంతులు, వికారంతో ఇబ్బంది పడుతుంటారు. వారు పుల్లగా ఉండే పచ్చి మామిడికాయను తింటే బాగుంటుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బద్ధకంగా ఉండేవారు పచ్చిమామిడిని తీసుకుంటే చురుగ్గా ఉంటారు. పచ్చిమామిడి తినడం వలన ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి. 
 
పుల్లటి మామిడి ముక్కల్లో ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాలను దూరం చేసే గుణం ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొత్త రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్, రక్తం కారడం, పన్ను నొప్పి వంటివి దూరం కావాలంటే మామిడి ముక్కను నమలాలి. దాంతో బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. దంతాలు శుభ్రపడుతాయి. పళ్ల మీద ఎనామిల్‌ కూడా దృఢంగా ఉంటుంది. నోటి దుర్వాసనలు దూరమవుతాయి.