1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 జులై 2016 (15:46 IST)

వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి మొక్కజొన్నలు తినడం మంచిదా? కాదా?

వర్షం పడుతున్నప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కజొన్నలు తినడానికి ఇష్టపడతారు. అలా వర్షాకాలంతో మొక్కజొన్నలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేసినట్లే అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వర్షాకాలంల

వర్షం పడుతున్నప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కజొన్నలు తినడానికి ఇష్టపడతారు. అలా వర్షాకాలంతో మొక్కజొన్నలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేసినట్లే అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వర్షాకాలంలో మొక్కజొన్నల్ని తీసుకోవడం ద్వారా కొవ్వును అవి అదుపులో ఉంచుతాయి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లూ, పీచు సమృద్ధిగా ఉంటాయి. 
 
మొక్కజొన్నలకు వెన్న, ఇతరత్రా పదార్థాలు కలపకుండా కాస్త ఉప్పు మాత్రమే చేర్చి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారు. అలాగే తాజా పండ్లు, కూరగాయలు కూడా వర్షాకాలంలో శరీరంలో కొవ్వును పేరుకోనివ్వకుండా చేస్తాయి. తాజా పండ్లూ, కాయగూరల్లో ఉండే పొటాషియం... కొవ్వుని కరిగిస్తుంది.
 
పప్పు ధాన్యాలూ, తృణధాన్యాల్లో పీచు పదార్థాలుంటాయి. వీటిల్లోని పీచు శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. అలాగే క్యాల్షియంతో పాటు శరీరంలో కొవ్వు చేరకుండా ఉండాలంటే పెరుగును వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చిని కూరల్లో వాడటం ద్వారా కెలోరీలను కరిగిస్తుంది.