వేప నూనె కలిపిన నీళ్లతో రోజూ ఉదయం అలా చేస్తే? (video)
నోటికి సంబంధించిన అనేక సమస్యలకు వేప మంచి ఔషదం. ఒక గ్లాసు నీటిలో టీస్పూను వేపనూనె కలిపి ఆ నీటితో నోటిని బాగా పుక్కిలించినట్లయితే చిగుళ్ల నుండి రక్తం కారడం, మౌత్ అల్సర్, చిగుళ్ల నొప్పులు వంటివి పూర్తిగా నయమవుతాయి. రోజూ ఉదయాన్నే పది తాజా వేపాకులను నములుతుంటే నోటికి సంబందించిన సమస్యలు రావు.
నువ్వుల నూనె లేదా ఆముదంలో వెల్లుల్లి రేకలు వేసి ఐదు నిమిషాల సేపు సన్నని మంటమీద మరిగించాలి. ఈ నూనెతో వెన్నుకు మర్దనా చేయాలి. వీటికి బదులుగా ఏదైనా వంటనూనెను కూడా వాడవచ్చు. అలా రాస్తుంటే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
నులిపురుగుల సమస్య నుంచి విముక్తి పొందాలంటే టీస్పూను వాము, టీ స్పూను ఆముదం కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి.
నోటిపూత బాధిస్తుంటే మాచికాయను నూరి నీటిలో కలిపి ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తుంటే రెండు రోజులకు పూత పూర్తిగా తగ్గుతుంది.
డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి సోయాబీన్ బాగా పని చేస్తుంది. పోషకాలు మెండుగా ఉండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంగా సోయాబీన్‌ను ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషనిష్టులు గుర్తించారు.
పంటినొప్పి వచ్చినప్పుడు నొప్పి ఉన్నచోట లవంగ నూనె రాయాలి. దాంతో నొప్పి చాలావరకు ఉపశమిస్తుంది.