శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: శనివారం, 24 డిశెంబరు 2016 (13:59 IST)

ఉల్లిపాయ: చిన్నపిల్లలకు అలా... పెద్దవాళ్లకు ఇలా ఉపయోగపడుతుంది...

ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ ఫలితాలు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లను నిద్రపుచ్చేందుకు వంటింటి చిట్కాను ఉపయోగించవచ్చు. ఓ చిన్న ఉల్లిపాయని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రం తీసుకొని అందులో రెండ

ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ ఫలితాలు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లను నిద్రపుచ్చేందుకు వంటింటి చిట్కాను ఉపయోగించవచ్చు. ఓ చిన్న ఉల్లిపాయని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రం తీసుకొని అందులో రెండు స్పూన్‌ల చక్కర చేర్చి ఇస్తే పిల్లలకి మంచి నిద్రవస్తుంది. 
 
అలాగే, చిన్న పిల్లలకు వచ్చే టాన్సిల్ వ్యాధికి ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు చేర్చి తినాలి. తర్వాత గోరు వెచ్చని నీటిని తాగించినట్టయితే వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. 
 
మరికొంతమంది చిన్నారులకు చెవి నొప్పి ఉంటుంది. ఇలాంటి వారు ఉల్లిపాయ రసం తీసుకొని వేడిచేసి చలార్చిన తర్వాత చెవిలో వేసినట్టు అయితే చెవి నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అజీర్తి కారణంగా వాంతులు, విరోచనాలు ఎక్కువగా అయ్యే వారు ఉల్లిపాయ రసం అరకప్పు తీసుకొని గోరువెచ్చని నీటిని కలిపి అప్పుడప్పుడు తాగినట్లైతే వాంతులు, విరోచనాలు తగ్గుముఖం పడుతుంది. 
 
ముక్కు ద్వారా రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కట్ట్ చేసి ముక్కు దగ్గర పెట్టి వాసన చూసినట్లైతే వెంటనే రక్తం రావటం ఆగిపోతుంది. ఉల్లిపాయ రసం లేదా ఉల్లిపాయ రసం, మంచినూనె సమపాళ్లలో కలిపిన రసాన్ని నాలుగు ఐదు చుక్కలు తీసుకొని పుచ్చుపళ్లు ఉన్న దగ్గర పట్టిస్తే అందులోని పురుగు చచ్చిపోయి వెంటనే నొప్పిని తగ్గిపోతుంది. ఉల్లిపాయ రసం అరకప్పు, తేనె చిన్నపాటి స్పూన్ చేర్చిన రసాన్ని ఉదయం, మధ్యాహ్నం రెండు వేళల్లో 25 రోజులు తాగినట్టు అయితే పురుషులలో వీర్యశక్తి బాగా పెరుగుతుంది.