ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (17:18 IST)

జుట్టుకు మేలు చేసే ఉల్లి రసం...

Onion Juice
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయలు దివ్యౌషధంగా ఉపయోగిస్తారు. ఉల్లిపాయలు సూక్ష్మక్రిములతో పోరాడే పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జుట్టుకు ఉల్లిపాయ రసం పూయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

జుట్టు దట్టంగా పెరుగుతుంది. చిన్న ఉల్లిపాయలను మిక్సీలో నీటిని చేర్చి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ బౌల్‌లో వడగట్టుకుని.. ఆ రసాన్ని తల మాడుకు పట్టించాలి. తలకు బాగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం వుంటుంది.
 
జుట్టు రాలడాన్ని నియంత్రించాలంటే.. పావు కప్పు ఉల్లి రసాన్ని, ఒక స్పూన్ తేనెను చేర్చి కలుపుకోవాలి. తర్వాత 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది. కరివేపాకు పొడి కూడా జుట్టును నెరవకుండా చేస్తుంది.

గుప్పెడు కరివేపాకు పేస్టును తీసుకుని, అందుకు ఒక స్పూన్ ఉల్లి రసాన్ని చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించి.. ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది.