1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (20:22 IST)

అధిక బరువు... అంత ఈజీగా వదిలేయకండి... ఈ చిట్కాలు....

అధిక బరువు... ఈ సమస్య చాలామందిని అనారోగ్యం బారిన పడేస్తుంది. కనుక ఈ బరువును తగ్గించుకునేందుకు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల లావవుతారనేది నిజం కాదు. పాలతో చేసే పదార్థాలలో అధికంగా ఉన్న క్యాల్షియం, ప్రోటీన్లు ఆరోగ్యానికి మంచే చేస్తాయి. కాకపోతే వెన్నతీసిన పాలను తీసుకోవడం మంచిది. 
 
కొవ్వుశాతం ఎక్కువగా ఉన్న పాలు, పెరుగు, ఐస్ క్రీమ్‌లను తీసుకోవడం తగ్గించండి.
 
దుంపకూరలను అధికంగా తినకండి. బీన్స్, ఆకు కూరలకు ప్రాధాన్యం ఇవ్వండి
 
ఉదయాన్నే లేవగానే పూరీ, దోసె వంటి నూనె పదార్థాలకు బదులు బ్రెడ్, రోటీలను తినండి
 
మసాలా బ్రెడ్ లు, కేక్ లు, బిస్కెట్ లు తినడం పూర్తిగా మానేయండి
 
అందరికంటే సన్నగా స్లిమ్ గా తయారవాలనుకుంటే అందరికంటే ఎక్కువ నీళ్లు తాగండి
 
వీలైనప్పుడల్లా కొబ్బరి బొండాలు తాగుతుండండి
 
కాఫీ, కోలాలు, బాదం మిల్కులు తాగారో... బరువు పెరగడం ఖాయం. కనుక వాటికి స్వస్తి చెప్పండి
 
మొలకెత్తిన పెసలు, శెనగలు, బొబ్బర్లు తింటే ఒంట్లో కొవ్వు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. మరి నేటి నుంచే ప్రయత్నం మొదలుపెట్టండి.