1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2016 (18:02 IST)

ఎముకల ఆరోగ్యానికి దోహదపడే బొప్పాయి.. ఇన్ఫెక్షన్లు చేరిన చోట..?

బీటా కెరోటిన్, విటమిన్- కె పుష్కలంగా ఉండే బొప్పాయి పండును తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కైమోపాపైన్‌, పాపైన్‌ అనే ఎంజైమ్‌లు ఉండే బొప్పాయి గుజ్జుని

బీటా కెరోటిన్, విటమిన్- కె పుష్కలంగా ఉండే బొప్పాయి పండును తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కైమోపాపైన్‌, పాపైన్‌ అనే ఎంజైమ్‌లు ఉండే బొప్పాయి గుజ్జుని ఇన్ఫెక్షన్‌ చేరిన ప్రాంతంలో లేదా కాలిన గాయాలమీద పెట్టడంవల్ల అవి త్వరగా తగ్గుతాయి. 
 
మధుమేహుల్లో చక్కెర శాతం పెరగకుండా ఉండేందుకు పీచుపదార్థం ఎంతో అవసరం. బొప్పాయిలో అది సమృద్ధిగా ఉంటుంది. బొప్పాయిలోని పాపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియకీ దోహదపడుతుంది. పొటాషియం, పీచూ ఎక్కువగా ఉండటంవల్ల హృద్రోగ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
బొప్పాయిలోని కోలీన్‌ నిద్రలేమికి చెక్ పెడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కొవ్వును కరిగిస్తుంది. తద్వారా శరీర బరువును తగ్గిస్తుంది. ఇందులోని  యాంటీఆక్సిడెంట్‌ పేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లను దూరం చేస్తుంది.