శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 14 మే 2023 (22:43 IST)

స్వీట్లు లేదా చక్కెర మోతాదుకి మించి తింటే?

sweets
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది.
 
అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి.
 
అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. 
అధిక చక్కెర వినియోగం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు, ఆందోళన, నిరాశ వంటి భావోద్వేగ రుగ్మతలు కలుగుతాయంటారు. ఫ్రక్టోజ్ అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.